NDL: కల్లూరు అర్బన్ 26వ వార్డు విఠల్ నగర్ సవారమ్మ గుడి వద్ద సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఇవాళ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.