KDP: లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా గొడ్డుమర్రికి చెందిన కప్పల గంగాధర్గా స్థానికులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.