PLD: బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు, రామాపురం పేరూరుపాడు, బొల్లాపల్లి, రేమిడిచర్ల తదితర గ్రామాలలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలు ఒకరినొకరు ఆలింగణం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దేశ శాంతి సౌభాగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.