AKP: ఎస్ రాయవరం మండలం పెనుగొల్లులో శివాలయం నిర్మాణానికి అదే మండలం ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన వెదుళ్ళ బాబూరావు, సత్యవతి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, వెంకటరత్నంకు నగదు అందజేశారు. దాతలు సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.