కోనసీమ: మండపేట నియోజక వర్గం అంగరకు చెందిన మేకా సూర్య భాస్కరరావు కమ్మ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. గత జెడ్పీటీసీ ఎన్నికల్లో కపిలేశ్వరపురం జెడ్పీటీసీగా జనసేన్ అభ్యర్థిగా పోటీచేశారు.