VSP: విశాఖ వాల్తేరు డివిజన్, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు, ‘స్వచ్ఛతా హీ సేవ 2025’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం గాంధీ జయంతి రోజున ముగుస్తుందని డీఆర్ ఎం లలిత్ బోహ్రా బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా విశాఖలోని డాల్ఫిన్ నోస్ రైల్వే కాలనీలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు.