అన్నమయ్య: రాజంపేట టీడీపీ ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ వైసీపీ చేపట్టిన రైతు పోరుబాట కార్యక్రమం కేవలం ఉనికిని చాటుకోవడానికేనని విమర్శించారు. ఈ మేరకు ఉల్లి, ఉర్లగడ్డ తేడా తెలియని జగన్ రైతుల సమస్యలపై మాట్లాడటం విడ్డూరమని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, మామిడి రైతులకు మద్దతు ధరతో పాటు ఉల్లిపాయలను క్వింటాకు రూ.1200లకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు.