NLR: ఉదయగిరి మండలం కొట్టాలపల్లి సొసైటీ కార్యాలయం వద్ద ఇవాళ నుంచి యూరియా పంపిణీ ప్రారంభం కానుంది. సొసైటీ ఛైర్మన్ గడ్డం వెంకటసామయ్య గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. సొసైటీకి 13 టన్నుల యూరియా అందినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డుతో వచ్చి యూరియాను పొందాలని సూచించారు.