ATP: ఉరవకొండ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్లు ఈవో తిరుమల రెడ్డి తెలిపారు. ప్రాతఃకాల పూజల అనంతరం ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4న ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించిన తరువాత భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. మరోవైపు శనివారం స్వామివారి పల్లకీ సేవ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.