CTR: కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ తెలిపారు. ఇందులో సుమారు 33 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర డిగ్రీ చేసిన యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు.