GNTR: గుంటూరులో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఆదివారం విద్యుత్ లైన్లు, స్తంభాలను పునరుద్ధరించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారి డీఈ గురవయ్య తెలిపారు. ఈ కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అశోక్‌నగర్, బ్రాడీపేట, కంకరగుంట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.