సత్యసాయి: పెనుకొండ మండలం గుట్టూరులో వైసీపీ సీనియర్ నాయకులు పిట్ట ఆదిశేషులు తండ్రి పిట్ట ఆంజనేయులు ఇటీవల అనారోగ్య కారణంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ఆదిశేషులు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి వెంట స్థానిక వైసీపీ నాయకులు ఉన్నారు.