KRNL: దేవనకొండలోని ZPHS పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు బరితెగించారు. పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పగలగొట్టి వాటి కేబుళ్లను దొంగిలించినట్లు శనివారం హెచ్ఎం నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.