GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బీసీ కాలనీలో బుధవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ వైద్యాధికారి ఏసుబాబు, నందులపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక పాల్గొని వైద్య పరీక్షలు చేశారు.