ప్రకాశం: ఒంగోలు పర్యటన నిమిత్తం వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం కలిశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి ఆనం ఒంగోలుకు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మర్యాదపూర్వకంగా కలవగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.