BPT: బాపట్ల సూర్యలంక రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. చింతావారిపాలెం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ శ్రీనివాస వరప్రసాద్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా లారీలను నిలపడమే ప్రమాదానికి కారణమని వారు పేర్కొన్నారు. ఇసుక లారీల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు.