కోనసీమ: పాలకులకు చిత్తశుద్ది లేదని MRPS నాయకులు ధూళి జయరాజు విమర్శించారు. కొమరిపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో బాధితులకు న్యాయం జరగకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కపిలేశ్వరపురం మండలం అంగరలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షం మౌనం బాధితులకు శాపంగా మారిందని ఆరోపించారు. న్యాయం జరగకపోతే కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఇల్లు ముట్టడిస్తామన్నారు.