E.G: రాజమండ్రి పుష్కర పనులకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ… పుష్కరాలు కేవలం రాజమండ్రి పరిధే కాదని, కోనసీమ, అంతర్వేది వరకు ఉందని అధికారులు గుర్తించాలన్నారు. 2027-పుష్కరాల ముహూర్తం తప్పు అని ఆ ముహుర్తాన్ని మార్చాలన్నారు.