కృష్ణా: ఉంగుటూరు మండలం ఎలుకపాడు గ్రామ అసైన్మెంట్ భూ బాధితులు రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో నాలుగో రోజుకు చేరాయి. 1979-80లో వారికి కేటాయించిన 12 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్ చేయకపోవడంతో రైతు భరోసా, రైతు నేస్తం, పంట పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.