NLR: ఆకుకూరల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేజర్ల సుధాకర్ రావు తెలియజేశారు. శనివారం ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆకుకూరలు పండించే ప్రాంతాల్లో హెల్త్ సిబ్బంది పర్యటించారు. గోంగూర అత్యంత తక్కువ ఖర్చు, ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారమని ఈ సందర్భంగా తెలియజేశారు.