నెల్లూరులో విద్యార్థినులు తమకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పి మంచిమనసు చాటుకున్నారు. కాజీపేటలో మార్గంలోని SBI బ్యాంక్ సమీపంలో రోడ్డుపై ZP బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ. 6,28,500 విలువ గల 4.5 సవర్ల బంగారం దొరికింది. వారు బంగారాన్ని ఎస్సై స్వరూపకు అందించారు. ఆ బంగారం పట్టణంలోని మహాలక్ష్మి అనే మహిళకు చెందినదిగా గుర్తించి అప్పగించారు.