కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఛైర్మన్ ముదునూరి వెంకటరాజు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని చంద్రమౌళి ఆకాంక్షించారు.