కోనసీమ: అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టా నరేష్(39) శుక్రవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలో అలముకున్నాయి. పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.