VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం తన కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలు, వచ్చే ఏడాది ప్రణాళికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగంగా పూర్తికావాలన్నారు. ఈ సందర్భంగా చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. గ్రామీణ అభివృద్ధి, ఉపాధి సృష్టికి ఉపాధి హామీ పథకం కీలకమని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.