KDP: కమలాపురం మండలంలోని శ్రీ రామాపురం పుణ్యక్షేత్రంలో ఉన్న శ్రీ మోక్ష నారాయణ స్వామి ఆలయంలో డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు, పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ తెలిపారు. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు.