W.G: విధి నిర్వహణలో మృతి చెందిన పెనుమంట్ర మండలం పొలమూరుకు చెందిన జవాన్ రాజశేఖర్ అంత్యక్రియలు బుధవారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. విజయవాడ నుంచి ఉదయం 10 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో భారీ ర్యాలీతో స్వగ్రామానికి తీసుకురానున్నారు. వీర జవాన్‌కు తుది నివాళి అర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.