NTR: వీరులపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్సై అభిమన్యు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లను వివరించారు. వ్యక్తిగత భద్రతపై జాగ్రత్తలు చెప్పించారు. అలాగే సోషల్ మీడియాలో జరిగే మోసాలు, ప్రమాదాల గురించి కూడా విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించిందని ఉపాధ్యాయులు తెలిపారు.