అన్నమయ్య: పుల్లంపేట సీపీఐ మండల కార్యదర్శిపై దాడి చేసిన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ తహాసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేసి MROకు వినతి పత్రం అందజేశారు. మండలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయని వాటిపై సమగ్ర విచారణ చేయాలని చేప్పారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.