SKLM: జిల్లాలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు తప్పనిసరిగా ఈసీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ఓటర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించే విధంగా ఉండాలని అన్నారు.