VSP: భైరవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం అధికారులను ఆదేశించారు. ఆలయానికి వెళ్లే రోడ్డును మెరుగుపరచడంతో పాటు, భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గ్రాండ్ ఆర్చ్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. అనంతరం భైరవస్వామిని దర్శించుకుని పూజలు చేశారు.