E.G: రాజమండ్రిలోని ఎస్.టి పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హై స్కూల్, ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కె.వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడారు. బాలికలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించకపోవడం వలన సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు.