ATP: తాడిపత్రి శివాలయం సమీపంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ.3,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మండలంలోని చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఓ మట్కాబీటర్ను అరెస్ట్ చేసి రూ.17,150 స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు.