SKLM: పోలాకి ఎంఈవో 2గా ఎస్. శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఇక్కడ ఎంఈవో 2గా పనిచేసిన తలగాన లింగరాజు గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో స్థానిక మండలంలోని దీర్ఘాసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని ఎంఈవోగా నియమించారు.