KDP: డేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన పెసల అమ్మనమ్మ (60) అనే మహిళ బుధవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమవడంతో సమీప పెన్నానదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళ అదృశ్యమైనట్లు ఆమె బంధువులు సమాచారం ఇచ్చారన్నారు. ఈ మేరకు అదృశ్యమైన మహిళ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందగా.. ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు.