ATP: స్వాతంత్య్ర సమరయోధుడు పప్పూరు రామాచార్యుల 54వ వర్ధంతి వేడుకలు అనంతపురంలో శనివారం ఘనంగా జరిగాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం పురపాలక సంస్థ తొలి ఛైర్మన్గా, గ్రంథాలయ ఉద్యమ నేతగా రామాచార్యులు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.