E.G: రాజమండ్రి లాలచెరువు సబ్ స్టేషన్ పరిధిలో నూతన విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. ఎస్బీఐ కాలనీ, రెవెన్యూ కాలనీ, చౌడేశ్వరి నగర్, గాయత్రి నగర్, శశి స్కూల్ ప్రాంతం, గ్లో గార్డెన్, పోస్టల్ కాలనీ, నారాయణపురం, లాలచెరువు తదితర ప్రాంతాలలో సరఫరా ఉండదన్నారు.