GNTR: రాజధాని ప్రాంతం నుంచి విజయవాడకు అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో రవాణాకు సంబంధించిన సరైన పత్రాలు చూపకపోవడంతో వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతులు లేకుండా మట్టిని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.