AKP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న నేపాధ్యంలో బుధవారం అనకాపల్లి టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి మిఠాయి పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ.. నాడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు.