కృష్ణా: నూజివీడు పట్టణంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులకు ఆదివారం దంత సమస్యలపై అవగాహన కల్పించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ దేవిశెట్టి దినేష్ బాబు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా దంత ధావనం చేయాలన్నారు. దంత ధావనం చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూపారు. దంతాలు, చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు అశ్రద్ధ చేయవద్దన్నారు.