VZM: బొబ్బిలి మున్సిపల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు అన్నారు. బొబ్బిలిలోని 17వ వార్డులో గురువారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీలో మౌలిక సౌకర్యాలు కల్పనకు పని చేస్తున్నామని వెల్లడించారు. అన్నీ వార్డులలో కాలువలు, రోడ్లు నిర్మాణం చేస్తామన్నారు.