ప్రకాశం: ప్రతి డివిజన్లోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేస్తామని MLA ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు తిరుపతిలోని 35వ వార్డు భవాని నగర్లో సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే, కమిషనర్ ఎన్.మౌర్య ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు.