VSP: తగరపువలసలో ప్రభుత్వ నిత్యావసర వస్తువుల డిపోలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ భీమిలి ఏరియా సమితి వినతిపత్రం సమర్పించింది. CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోందని వేగవంతం చేయాలని కోరారు. డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్కి సీపీఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు.