KRNL: ఇసుక ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆదోనిలో నిరసన తెలిపింది. మంగళవారం పట్టణ అధ్యక్షులు వై.సాయినాథ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం 5 టన్నుల ఇసుక ధర రూ. 25,000కు మించి ఉందని, ఇది పేద ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు.