MBNR: శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన తలియ కుండ సమర్పణ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ తలియ కుండను కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి గ్రామం నుంచి ప్రత్యేక పూజలతో, భక్తులు, గ్రామస్తులు భారీ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు.