CTR: సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం దానికి భిన్నంగా కొంతమంది సిబ్బంది నడుచుకుంటున్నారన్నారు.