GNTR: గుంటూరులోని ఉదయశ్రీ మహిళా సమాజం వృద్ధాశ్రమాన్ని గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. వృద్ధ మహిళలకు అందుతున్న వైద్యం, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి పెన్షన్, రేషన్ కార్డులు లేవని తెలిసి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.