GNTR: గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జిల్లా నాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని, పార్టీ సిద్ధాంతాలను స్మరించుకున్నారు.