కోనసీమ: వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకటరాజు, డీసీ చక్రధరరావులతో కలిసి మంగళవారం ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.