NLR: సర్వేపల్లిలో రికార్డు స్థాయిలో CMRF సాయం అందించినట్లు MLA సోమిరెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 514 మందికి రూ.5.34 కోట్లు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. శుక్రవారం 92 మందికి రూ.74 లక్షల చెక్కుల పంపిణీ చేశారు. తాము ప్రజల కోసం పనిచేస్తుంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి తినింది అరగక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడనీ సోమిరెడ్డి విమర్శించారు.