మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు మైనర్ డ్రైవింగ్‌పై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఇలా చేస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు, జరిమానాలు, జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. వేసవి సెలవుల్లో పిల్లలు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు.